సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మహేంద్రనాథ్...
చీరాల: ప్రజారోగ్యానికి టిడిపి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని,
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమందికి పునర్జన్మ ప్రసాదిస్తోందని
చీరాల నియోజకవర్గ టిడిపి అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ అన్నారు. నియోజకవర్గంలో 36 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన
41లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులను ఆయన బుధవారం
లబ్ధిదారులకు అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
చేయించేందుకు టిడిపి ఆఫీస్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు.
No comments