Latest News

విజయవంతమైన గుంటూరు వికాస్ హాస్పిటల్ వారి మెగా వైద్య శిబిరం......

చీరాల:చీరాల మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత మెగా శిబిరాన్ని వికాస్ హాస్పిటల్స్ గుంటూరు వారి సహకారంతో నిర్వహించామని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ అధ్యక్షులు చంద్రశేఖర రావు, గుర్రం రాఘవరావులు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ బి నాగరాజు, వ్యాసుకులర్ సర్జన్ డాక్టర్ సురేంద్ర నాగులపాటి, న్యూరాలజిస్ట్ డాక్టర్ సురేష్ బాబు వల్లపు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ వైద్య శిబిరంలో గుండె,మెదడు మరియు నరములకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు.ఉచిత వైద్యం శిబిరాన్ని చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో వినియోగించుకున్నారు. 

ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాతులూరి నరసింహామూర్తి కి మరియు మార్కెటింగ్ హెచ్ ఓ డి పీఎన్బీ ఉమామహేశ్వరరావు కి మరియు వికాస్ హాస్పిటల్ సిబ్బందికి మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ తరపున అభినందనలు తెలియజేశారు.


No comments