Latest News

మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కార్డులను పంపిణీ చేసిన మద్దులూరి మహేంద్రనాథ్....

 


చీరాల:చీరాల తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కార్డులు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ .
ఈ సందర్భంగా మహేంద్రనాథ్ మాట్లాడుతూ చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఓడరేవు నందు టూరిజం డెవలప్మెంట్ కొరకు ప్రణాళికనీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు ప్రతిపాదనను పంపారని, ఓడరేవు నందు పోర్ట్ ఏర్పాటు కొరకు మంత్రితో చర్చించడం జరిగింది అని అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని. మత్స్యకారులకు భరోసా కింద 10,000 ఆర్థిక సాయం అందిస్తుందని అన్నారు.ముఖ్యంగా చేపల వేట నిషేధ కాలంలో వారి జీవనోపాధిని కాపాడటం కూటమి ప్రభుత్వ లక్ష్యం, మోటర్ పడవ యజమాని నెలకు 300 లీటర్ల వరకు సబ్సిడీ డీజిల్ పొందవచ్చునని, లీటరుకు తొమ్మిది రూపాయలు డీజిల్ సబ్సిడీని అందిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పిక్కి నారాయణరావు, పిన్ని పోయిన రామకృష్ణ, వాడరేవు సచివాలయ ఫిషరీస్ సిబ్బంది మరియు తెలుగుదేశం,జనసేన,బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
.

No comments