Latest News

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటిల్లో విజేతగా సెయింట్ ఆన్స్ జట్టు


చీరాల (chirala) :
ఆర్.వి.అర్ & జే.సి  గుంటూరులో జరిగిన స్పోర్ట్స్ ఫెస్ట్ -2024 లో తమ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాల వాలీబాల్ జట్టు విన్నర్ గా నిలిచిందని కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ యస్. లక్ష్మణరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మొయిద వేణుగోపాలరావు మాట్లాడుతూ తమ విద్యార్ధులు విద్యతో పాటు క్రీడల్లో రాణంచడం గర్వంగా ఉందని, కీడల్లో పాల్గొనే వారికి ఆత్మవిశ్వాసం, చురుకుదనం, వత్తిడిని ఎదుర్కొనే తత్వం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ  వాలీబాల్ పోటీల్లో కళాశాల బి.టెక్ వాలీబాల్ జట్టు విన్నర్స్ గా నిలవడం ఏంతో సంతోషదాయకమన్నారు.  ఈ పోటీలలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 24 కళాశాలల నుండి వాలీబాల్ జట్లు పాల్గొనగా, ఫైనల్ పోటీలో ఆర్.వి.అర్ & జే.సి 

 జట్టును ఓడించి విన్నర్స్ గా నిలిచిందన్నారు. ఫైనల్స్ పోటీలో రెండు సెట్సతోనే భారీస్థాయి తేడాతో విజయం సాధించినట్లు తెలిపారు. తమ కళాశాల జట్టులో రమణ, రేవంత్, మణి కుమార్, శివా రెడ్డి, విష్ణు బాబు, తాతాజీ, సాయికృష్ణ, ఆండ్రూస్, తేజా రెడ్డి, సాయి, సన్ని, మణికంఠలు పాల్గొన్నట్లు తెలిపారు. విన్నర్స్ గా నిలిచిన ఈ జట్టుకు రు.10,000 బహుమతితో పాటు క్రీడాకారులకు వ్యక్తిగత సర్టిఫికెట్స్,  కప్పును బహుకరించారని తెలిపారు. గెలుపొందిన జట్టుకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్.వి. రమణమూర్తి, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ ఎస్ అనిల్ కుమార్, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీ తులసి, వివిధ విభాగాధిపతులు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధిని విద్యార్థులు అభినందనలు తెలిపారు.

No comments