Latest News

విజయవంతమైన ఐకాన్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం


రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల, ఐకాన్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ విజయవంతమైంది. ముందుగా రోటరీ క్లబ్ సామాజిక భవనం నుండి పట్టణ పురవీధులలో 2కే వాక్ నిర్వహించారు. ఆరోగ్యానికి సంబంధించిన నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శరత్ బాబు ప్రారంభించారు. డాక్టర్ శంకరశెట్టి కొండలరావు మాట్లాడుతూ ఎముకలకు విటమిన్ డి ఎంతో అవసరమని, ఆ విటమిన్ సూర్యరశ్మిలో మాత్రమే దొరుకుతుందని, అది ఉచితంగా ఉదయం పూట సూర్యకిరణాలు సాయంత్రం కంటే మెరుగుగా ఉంటాయని, అది ఉదయం 8గంటల లోపు మాత్రమే నడక మంచిదని వైద్యులు డా,, కొండలరావు సూచించారు.ఐకాన్ హాస్పిటల్ సిబ్బంది రోటరీ కమ్యూనిటీ హాలులో వైద్యపరీక్షలు చేసి అవసరమైన వారికి మందులను ఉచితముగా అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకరశెట్టి కొండలరావు, స్వాతి, మామిడాల శ్రీనివాసరావు, చీరాల కృష్ణమూర్తి, పోలుదాసు రామకృష్ణ, డాక్టర్ బాబూరావు, జివై ప్రసాద్, గుర్రం రాఘవరావు, డివి సురేష్, చారుగుళ్ళ గురుప్రసాద్, పుల్లయ్య నాయుడు, బాలవెంకటేశ్వరరావు, హరినారాయణ, బదరినాథ్, హేమంత్ కుమార్, శంకరరెడ్డి, మూర్తి, ఐకాన్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

No comments