Latest News

దళిత వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం....

బాపట్ల జిల్లా(chirala):కాంగ్రెస్ తోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని ఆ పార్టీ నాయకులు మేకా శ్యాంప్రసాద్ అన్నారు.చీరాల పట్టణంలోని కారంచేడు గేటు వద్ద అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం కారంచేడు గేటు నుంచి మృతివీరుల రుదిర క్షేత్రం మీదగా బాపట్ల దాకా పాదయాత్ర చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...న్యాయ చైతన్య యాత్ర శనివారం ప్రారంభించా మన్నారు. కాంగ్రెస్ పార్టీ వాదిగా కాంగ్రెస్ సందేశాన్ని సామాజిక న్యాయం కోసం ఆర్ధిక న్యాయంకోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ సందేశాన్ని బలంగా ప్రజలకు వినిపించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా రాకుండా ఒక్క విభజన హామీ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభత్వం  పదేళ్లు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం  బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయలేదు అన్నారు.ఈ అన్యాయాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆంద్రప్రదేశ్ కి న్యాయం జరుగుతుందనే సందేశము తో ఈ యాత్ర ప్రారంభించామన్నారు.రానున్న ఎన్నికలలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుందన్నారు.రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణను పొందుతుందని గుర్తు చేశారు. బాపట్ల పార్లమెంట్ తరఫున ఎంపీ అభ్యర్థిగా తన పేరు పరిశీలనలో ఉందని,అవకాశం వస్తే ప్రజలందరి మద్దతుతో అఖండ మెజార్టీతో గెలుస్తానని హామీ ఇచ్చారు.చీరాల ప్రాంతానికి చెందిన తనకి ఈ ప్రాంత పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందన్నారు.దళిత వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ కు ఓటు వేస్తేనే సాధ్యపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో చిట్టిబాబు,సుందర్రావు,నవీన్ మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

No comments