Latest News

టిడిపిలోకి మాజీమంత్రి డాక్టర్ పాలేటి రామారావు...


బాపట్ల జిల్లా(chirala): మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో మాజీమంత్రి డాక్టర్ పాలేటి రామారావు మెడలో పార్టీ కండువా వేసి సాదరం గా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు రామారావు మరల తన సొంత ఇంటికి వచ్చారని, ఆయన నాకు మంచి పరిచయస్తులని, శాసనసభ్యుడిగా బాగా పనిచేశారని ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పాలేటి మాట్లాడుతూ చంద్రబాబు తనపై పెట్టిన నమ్మకాన్ని బాధ్యతతో నిర్వర్తిస్తానని చెప్పారు. చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.

No comments