Latest News

బిసిలే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క:ఎం.ఎం కొండయ్య

బాపట్ల జిల్లా(chirala):బిసి నాయకులను ఎందరినో తెలుగుదేశం పార్టీ తయారు చేసిందని చీరాల నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య పేర్కొన్నారు.ఆదివారం చీరాల మండలం బుర్లవారిపాలెంలో  జరిగిన ‘జయహో బిసి’ కార్యక్రమానికి మద్దులూరి మాల కొండయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భముగా కొండయ్య మాట్లాడుతూ బిసిలకు తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం లాంటిదని అన్నారు. బిసిలను ఎంఎల్‌ఏలుగానూ, ఎం.పిలుగానూ తయారు చేసిన ఫ్యాక్టరీ టిడిపిని ఆయన అభివర్ణించారు. ఉన్నత స్థాయిలో ఉండే ప్రతి వందమందిలో 50 మంది బిసిలే ఉండేలా చేసే బాధ్యత తనదని అన్నారు. పన్నుల రూపంలో జగన్‌ బలహీన వర్గాల రక్తం తాగుతున్నారని విమర్శించారు. జనాభాలో 50శాతం ఉన్న బిసిలకు రాజకీయ ప్రాధాన్యత, ఆర్ధిక వెసులుబాటు కల్పించి న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్‌,టిడిపి మాత్రమే అని చెప్పారు. స్థానిక సంస్థల్లో 20శాతం రిజర్వేషన్లు ఎన్టీఆర్‌ ప్రవేశపెడితే తాము 34శాతానికి పెంచామని తెలిపారు.వైసిపి ప్రభుత్వం 24శాతానికి తగ్గించి అన్యాయం చేసిందని విమర్శించారు. బిసిలు టిడిపి వెంట ఉన్నారనే అక్కసుతో వారి పై జగన్‌ దండయాత్ర చేస్తున్నారని  విమర్శించారు. జగన్‌ ఇచ్చిన కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు అలంకార ప్రాయమేనని , ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదని,టిడిపి అధికారంలోకి వస్తేనే బిసిలకు అభివృద్ధి ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బుర్లవారిపాలెం లో పలువురు నాయకులు తెలుగుదేశం అభ్యర్థి కొండయ్యకు మద్దతు తెలిపి పార్టీ లో చేరారు వారిని కొండయ్య  పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు, రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని వారిని కోరారు.ఈ కార్యక్రమంలో చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు హరి ప్రసాద్, ఎంఆర్ఎఫ్ రమేష్, బుర్ల వెంకటేశ్వర్లు గ్రామ్ పార్టీ అధ్యక్షులు, మరియు బీసీ సెల్ నాయకులు తెలుగుదేశం,జనసేన,బిజెపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments