Latest News

ప్రజా సంక్షేమమే టిడిపి లక్ష్యం: టిడిపి ఎంపీ అభ్యర్థి కృష్ణ ప్రసాద్

బాపట్ల జిల్లా(chirala):తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చీరాల నియోజకవర్గంను అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళటంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేలా ఐటి హబ్‌, ఫిషరింగ్‌ హార్బర్‌ వంటి ఏర్పాటుకు పెట్టుబడుదారులు వస్తారని అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాటు చేస్తామని బాపట్ల ఎంపి అభ్యర్థి కృష్ణ ప్రసాద్‌ అన్నారు. సోమవారం పట్టణంలోనే స్థానిక సప్తగిరి లాడ్జిలో నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. చీరాల ప్రాంతంలో అత్యధికంగా ఉన్న చేనేతల వర్గాల అభివృద్ధికి చేనేత టెక్ట్స్‌టైల్స్‌ పార్క్‌ ను నిర్మించి ఎక్స్‌పోర్ట్స్‌ రీసెర్చ్‌, ట్రైనింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌ లో చంద్రబాబు ఐటీ రంగాన్ని ఏర్పాటు చేసి ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం అవకాశాలను కల్పించగా, పరోక్షంగా మరో 25 లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. బాపట్ల పార్లమెంటరీ కేంద్రంగా చీరాల నియోజకవర్గంలో ఐటీ హబ్‌, ఫిషరింగ్‌ హార్బర్‌, పలు పరిశ్రమల వంటి ఏర్పాటులకు పెట్టుబడుదారులను తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో దళితులు, ముస్లిం మైనారిటీ, వెనకబడిన వర్గాల వారందరికీ స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కీం ద్వారా, బ్యాంకు రుణాలను సబ్సిడీతో అందించి వారిని అభివృద్ధి చేస్తామన్నారు. ఈపిరిపాలెంలో ఆటోనగర్‌ను అభివృద్ధి చేస్తామని, అదేవిధంగా కఅష్ణ కెనాల్‌, ఇరిగేషన్‌ వాటర్‌ ను రైతుల పొలాలకు చివరి ఎకరా వరకు నీరు అందిస్తామన్నారు. డ్రైనేజీ పారుదలను మెరుగుపరిచి తోటవారిపాలెం స్కీంను అభివృద్ధి చేస్తామన్నారు. దళితులకు సంబంధించిన 27 స్కీములను వైసిపి ప్రభుత్వం తొలగించింది అని టిడిపి అధికారంలోకి రాగానే వాటితో పాటు మరికొన్ని స్కీములను ఏర్పాటు చేస్తామన్నారు. కుందేరులో కాలువ ను అక్రమంగా పూర్తి చేసి అక్రమ నిర్మాణాలను వైసిపి చేపట్టిందని టిడిపి ప్రభుత్వం రాగానే దానిని కూల్చివేసి ప్రజా ఆస్తులను కాపాడి కుందేరును అభివృద్ధి చేస్తాం అన్నారు. ఈ నేపథ్యంలో చీరాల నుండి వాడరేవుకు నూతన రైల్వే లైన్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని అన్నారు. వేటపాలెం రైల్వే స్టేషన్‌ లో ప్లాట్‌ ఫారం చివర ఉన్న ఫ్లై ఓవర్‌ ను ప్రయాణికుల అవసరాల కోసం స్టేషన్‌ మధ్యలో ఏర్పాటు చేస్తాం అన్నారు. బాపట్ల, చీరాల, కారంచేడు కు ప్రధాన జంక్షన్‌ గా ఉన్న కారంచేడు గేటు వద్ద నూతనంగా ఆర్‌ఓబి ను నిర్మాణంకు, చీరాల ఫైర్‌ స్టేషన్‌ వద్ద ఆర్‌ఓబి కు ఏర్పాట్లు చేస్తాం అన్నారు. నియోజకవర్గంలో ప్రతి సమస్య తమ దృష్టిలో ఉందని రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం.కొండయ్యకు, ఎంపీ అభ్యర్థిగా ఉన్న తనకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించినట్లయితే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు నాతాని ఉమామహేశ్వరరావు, కూటమి నాయకులు, పలువురు పాల్గొన్నారు.

No comments