Latest News

బీచ్ లలో పర్యటకుల భద్రత కోసం చర్యలు చేపట్టిన పోలీసులు.....


బాపట్ల జిల్లా(chirala): చీరాల నియోజకవర్గంలో బీచ్ లకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని ఈపురుపాలెం ఎస్సై శివకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గత కొద్ది రోజుల నుండి వాడరేవు నుండి కటారివారి పాలెం గ్రామం వరకు సముద్రతీరంలో పర్యాటకులకు అనుమతి నిషేధించడమైనది.బాపట్ల జిల్లా ఎస్పీ  వకుల్ జిందాల్ ఐపిఎస్  యొక్క చొరవతో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చీరాల సముద్ర తీర ప్రాంతంలో ఉన్న రిసార్ట్స్ యాజమాన్యానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలని సలహాలు-సూచనలు జారీ చేయడం జరిగింది. వాడరేవు నుండి కటారివారి పాలెం వరకు సముద్ర తీరం సుమారు 8 కిలోమీటర్ల వరకు ఉన్నది.కావున ఈ ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో సముద్రం చాలా లోతుగా ఉండటం వల్ల పర్యాటకులకు సరైన అవగాహన లేకపోవడం వలన అన్ని ప్రదేశాల్లో పర్యాటకులు దిగి సముద్ర స్నానాలు చేయటం వలన గతంలో చాలా ప్రమాదాలు జరిగాయి.వాటిని దృష్టిలో పెట్టుకొని సముద్రతీర ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు దృఢ నిర్ణయం తీసుకోవడమైనది. ఈ నియమాలు పాటించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.వాడరేవు నుండి కటారివారి పాలెం గ్రామం వరకు పర్యాటకులు సముద్రతీరంలో స్నానం చేయుటకు ఏడు ప్రదేశాలను గుర్తించడమైనది సుమారు 1500 మీటర్లు కలదు.100 మీటర్లకు ఒకరు చొప్పున 15 మంది స్విమ్మర్లను ఏర్పాటు చేయడమైనది. ప్రతి స్విమ్మర్ కు ఒక లైఫ్ బామ్, లైఫ్ జాకెట్,విజిల్ మరియు మెగా ఫోన్ విత్ వాయిస్ రికార్డ్ ఇవ్వడమైనది.సముద్ర తీరంలో స్నానానికి కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే స్నానాలు చేయాలి.ప్రతి ఒక్కరులు స్విమ్మర్లకు పోలీస్ వారికి సహకరించాలి.మద్యం సేవించి సముద్రతీరా ప్రాంతాల్లో తిరిగితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడును, మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా నమోదు చేయబడును.మీ విలువైన వస్తువులకు మీరే బాధ్యత వహించవలెను.సముద్ర తీర ప్రాంతంలో నాట బడిన జండాలను దాటి లోపలికి వెళ్ళరాదు.రిసార్ట్స్ యాజమాన్య సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చెయ్యటమైనది.

No comments