జర్నలిస్టుల ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ ఫుట్బాల్ టోర్నమెంట్.....
చీరాల(chirala): చీరాల పట్టణంలో క్రీడా ప్రోత్సాహానికి ఒక ముఖ్యమైన ఘట్టంగా, ఎన్.ఆర్.పి.ఎం బాయ్స్ హై స్కూల్ క్రీడా మైదానంలో చీరాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు హాజరై, తొలిబంతిని గోల్ కొట్టి టోర్నమెంట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్.ఆర్.పి.ఎం హై స్కూల్ క్రీడా మైదానం యువకుల క్రీడా స్ఫూర్తితో నిండిపోయి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సంతరించుకుంది. ఇలాంటి పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంచేందుకు, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా వీర మహిళా నాయకురాలు కారంపూడి పద్మిని, సీనియర్ జర్నలిస్టు ఎస్.వి. కృష్ణారెడ్డి, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫుట్‌బాల్ ఆటగాళ్లు పాల్గొన్నారు.
No comments