చీరాల లో అర్హులైన ప్రతి ఒక్కరికీ నివేశనా స్థలాలు ఇవ్వాలి....
చీరాల(Chirala): కార్పొరేట్ లకు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పేదలకు ఇవ్వడానికి భూములు దొరకట్లేదా అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల శామ్యూల్ అన్నారు.సోమవారం చీరాల ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం వద్ద నుంచి ఇంటి స్థలం కేటాయించాలని కోరుతూ భారత కమ్యునిస్టు పార్టీ ఆద్వర్యంలో ఇళ్ళ స్థలాలు లేని పేద మహిళలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు..ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల శామ్యూల్ మేడ వెంకట్రావులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న ప్రభుత్వం ఇచ్చిన హామీ తక్షణమే అమలు పరచాలని అన్నారు ..పేద మహిళలకు కావాల్సింది జీఓ లు కాదని ఇచ్చిన జీఓను అమలు చేయాలన్నారు .మూడు నెలల క్రితం ఐదు వందలకు పైగా ఇళ్ళు లేని పేదలు ఇంటి స్థలాలు కేటాయించాలని నియోజకవర్గంలోని సచివాలయాలలో దరఖాస్తులు అందజేస్తే నేటికీ అధికారులు ఇచ్చిన దరఖాస్తులపై కనీసం విచారణ చెయ్యలేదని అన్నారు. చిత్తశుద్ధితో ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని పట్టణంలో రెండు సెంట్లు,పల్లెల్లో మూడు సెంట్లు స్థలం పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు..రికార్డులలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు జీఓ ఇచ్చారు కానీ వాస్తవంలో ప్రజలకు సెంటు స్థలం కేటాయించలేదని అన్నారు..ఇప్పటికైనా ఇళ్ళు లేని పేదలకు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈపురుపాలెంలో నూతనంగా నిర్మిస్తున్న హైవే కోసం ఇళ్ళు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని నిర్వాసితులకు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.సీపీఐ చీరాల నియోజక వర్గ కార్యదర్శి చిరుమల ప్రకాష్ మాట్లాడుతూ కార్పొరేట్లకు వేల ఎకరాలు కేటాయిస్తున్న ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో అలసత్వం వహించడం సరికాదన్నారు..ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని రాస్తారోకో లు నిర్వహిస్తామని హెచ్చరించారు..పేదల పక్షాన ఉదాసీన వైఖరి సరికాదని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని పేదల పక్షాన పోరాడేందుకు సిద్ధమన్నారు. పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని భారత కమ్యునిస్టు పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు ..అనంతరం చీరాల ఆర్డీఓ చంద్ర శేఖర్ నాయుడు కి వినతి పత్రం అందజేశారు..ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్ర శేఖర్ నాయుడు మాట్లాడుతూ ఇంటి స్థలం కేటాయించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించిన పేదలందరికీ దరఖాస్తులను విచారణ చేయిస్తామని తక్షణమే సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తామని అన్నారు..
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ చీరాల నియోజకవర్గ అధ్యక్షులు ఆచ్యుతుని బాబూరావు,ఏఐటీయూసీ చీరాల నియోజకవర్గ కార్యదర్శి బాసి పైడయ్య,సీపీఐ చీరాల పట్టణ కార్యదర్శి సైకం రాజశేఖర్,చీరాల మండల కార్యదర్శి కోల వీరాంజనేయులు,డేవతోటి నాగేశ్వరరావు, పున్నారావు, సురాడ శాంతి, రూతమ్మ,కుప్పాల ఆదిలక్ష్మి,పొదిలి రమణ,అన్నం వెంకాయమ్మ, ఇందిరా రాణీ ఉషా షుమారు మూడు వందలకు పైగా మహిళలు ఇంటి స్థలం కేటాయించాలని కోరుతూ ర్యాలీలో పాల్గొన్నారు .
No comments