చలివేంద్రాన్ని ప్రారంభించిన చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు..
వేటపాలెం: బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు వేటపాలెం ఎస్సై
వెంకటేశ్వర్లు శనివారం పోలీస్ స్టేషన్ సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు దీనిని ప్రారంభించారు. తొలి రోజున ప్రజలకు
మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ శేషగిరిరావు మాట్లాడుతూ వేసవి
తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజల సౌకర్యార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు
చేశామని తెలిపారు. చొరవతీసుకున్న ఎస్.ఐ నీ అభినందించారు.
No comments