చేనేతలకు చేయూతనిచ్చేది తెలుగుదేశం పార్టీ.....
చీరాల:చేనేతలకు మొదటి నుండి చేయూతనిచ్చేది తెలుగు దేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాధ్ అన్నారు..చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు విద్యుత్ రాయితీ మరియు పవర్ లూమ్ కార్మికులకు నెలకు 500 యూనిట్లు రాయితీ అందించిన సందర్భంగా చీరాల బస్టాండ్ సెంటర్లోని నందమూరి తారక రామారావు విగ్రహానికి మరియు ముక్కోణం పార్క్ వద్దగల బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గడియార స్తంభం వరకు చేనేతలతో పాదయాత్ర గా వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేతలకు గతంలో రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుది అని గుర్తు చేశారు. అలాగే మన శాసనసభ్యులు మద్దులూరి మాల కొండయ్య చీరాల నందు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ సజ్జ హేమలత, చేనేత కార్మికులు, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు.
No comments