జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి.
చీరాల(Chirala):అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ శ్రీకృష్ణ పై దాడిని ఖండిస్తూ బాపట్ల జిల్లా చీరాలలో జర్నలిస్టులు సోమవారం ఆందోళన చేపట్టారు.వీరికి మద్దతుగా చీరాల తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు,ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపారు.జర్నలిస్ట్ శ్రీకృష్ణ పై దాడికి పాల్పడిన వైసీపీ రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.ముందుగా పట్టణంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు మార్గాన గడియార స్తంభం సెంటర్ చేరుకొని అక్కడ మానవహారం నిర్వహించారు. శ్రీకృష్ణ పై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.అనంతరం చీరాల రెవెన్యూ కార్యాలయంలో తహసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కమలాకర్,దుర్గా ప్రసాద్,కొండ్ర కిరణ్,సాయి,ప్రదీప్,చందు,బాషా,వాసు,దిలీప్ ,రాజేష్,నెహేమ్యా,సంగీతరావు,రత్నాహార్,ప్రకాష్,మహేష్,కోటేశ్వరరావు,బద్రి,గోపి,చినబాబు,కళ్యాణ్,నాగరాజు,పౌల్,అశోక్,సుధాకర్,మరియు చీరాల టిడిపి యువ నాయకులు గౌరీ అమర్నాథ్, గజవల్లి శ్రీనివాసరావు, కౌతారపు జనార్ధన్, లావేటి శ్రీనివాస్ తేజ, కొమ్మనబోయిన రజిని,కర్పూరపు సుబ్బలక్ష్మి,నాగేశ్వరరావు,కిషోర్, బాలసుబ్రమణ్యం,బాబు, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, ప్రజా సంఘాల నాయకులు గుమ్మడి ఏసు రత్నం, షేక్ జిలాని,కొండయ్య, వసంతరావు,బాబురావు తదితరులు పాల్గొన్నారు.
No comments