Latest News

నిస్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి: డీఎస్పీ ప్రసాదరావు


చీరాల(chirala): రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రతి అధికారి కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ పాటించాలని, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిస్పక్షపాతంగా విధులు నిర్వహించి ప్రతి ఓటరు స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వినియోగించుకునేలా శాంతిభద్రతలను కాపాడాలని చీరాల డిఎస్పీ ఎస్. ప్రసాదరావు అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో సోమవారం చీరాల విఆర్ఎస్ వైఆర్ఎన్ కళాశాల ఆడిటోరియంలో చీరాల సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులకు,సిబ్బందికి సార్వత్రిక ఎన్నికల విధులు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాలెట్ పేపర్లు, ఈవీఎంలు, వివి ప్యాట్, ఇతర పోలింగ్ మెటీరియల్లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద తగిన సౌకర్యాలు కల్పిస్తూ భధ్రతా చర్యలు తీసుకోవాలని, గత ఎన్నికలలో నేరాలకు పాల్పడిన వారిపై, చెడునడత కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. నగదు, మధ్యం, అక్రమ రవాణాను అరికట్టేందుకు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనల గురించి, అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో చీరాలు ఒకటవ పట్టణ,రెండవ పట్టణ, రూరల్,ఇంకొల్లు, అద్దంకి టౌన్, అద్దంకి రూరల్ సిఐలు పిశేషగిరిరావు, కె. సోమశేఖర్, ఎన్. సత్య నారాయణ, బి.శ్రీనివాసరావు,పి. కృష్ణయ్య, ఏ.శివరామకృష్ణా రెడ్డిలు,సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments