Latest News

న్యాయవాదులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్:దేవరపల్లి రంగారావు

చీరాల కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ రమేష్ ఆధ్వర్యంలో సోమవారం ఏపీ భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలని దీక్ష చేపట్టారు.ఈ దీక్షకు మద్దతుగా చీరాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దేవరపల్లి రంగారావు సంఘిభావం తెలిపారు.ఈ సందర్భంగా రంగారావు  మాట్లాడుతూ...జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక చట్టం యాక్ట్ 27/ 23 ఏపీ భూహక్కుల చట్టం 2022 ను రద్దు చేయాలని,భూములపై యాజమాన్య హక్కులను నిర్వీర్యం చేస్తూన్నారని,రైతులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని అని అన్నారు.న్యాయ వ్యవస్థ ప్రమేయం లేకుండా  న్యాయ అన్యాయల పరిశీలన రెవెన్యూ చేతుల్లోకి మారితే సామాన్యులకు భంగం వాటిల్లు తుందన్నారు.ఈ క్రమంలో ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేయాలని,లేకుంటే న్యాయ వాదుల పోరాటానికి మా మద్దతు మరియు సహకారం ఉంటుందని అని తెలియజేసారు.అనంతరం వైసిపి ప్రభుత్వం తెచ్చిన జీవోను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బండ్లమూడి విజయ్ కుమార్, చలపతిరావు, మస్తాన్ రావు,సాయిబాబా,చంద్ర మరియు న్యాయవాదులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments