Latest News

ఆలా శ్రీధర్ కు జనసేన పార్టీలో కీలక బాధ్యతలు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 2024 ఎన్నికల నిర్వహణ కార్యక్రమంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  పాల్గొనే కార్యక్రమాలు సభలకు సంబంధించిన ఏర్పాట్ల పర్యవేక్షణ నిమిత్తం నియమించిన కమిటీలో చీరాల నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత ఆలా శ్రీధర్ కు సముచిత స్థానం లభించింది.ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.సెంట్రల్ ఆంధ్రజోన్ లో శ్రీధర్ ఈ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.ఈ సందర్భంగా ఆలా శ్రీధర్ మాట్లాడుతూ...జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ లో ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులుగా నియమించటం చాలా ఆనందంగా ఉందన్నారు.రాబోయే ఎన్నికల్లో తమ వంతుగా బాధ్యతగా నిశ్వారాదంగా పనిచేసేందుకు జనసేన పార్టీ గెలుపు దిశగా కృషి చేస్తానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సెంట్రల్ ఆంధ్ర పరిధిలో అన్ని నియోజకవర్గంలో పర్యటన చేయనట్లు తెలిపారు.ఈ అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి,పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి,అలా అనిల్ కుమార్ కి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments