Latest News

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.....


చీరాల (chirala) : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు దీక్ష చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం రబ్బరు బుల్లెట్లు ప్రయోగించి రైతు ప్రాణాలు పోవడానికి కారకులయ్యారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్ అన్నారు..శుక్రవారం చీరాల ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో జాతీయ కార్మిక సంఘాలు,రైతు సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించారు..ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో రైతుల స్థితిగతులు దిగజారిపోతున్నాయని రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు.. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక దేశానికి అన్నం పెట్టే రైతన్నలు అల్లడిపోతున్నారని అన్నారు..గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దు అయ్యేంత వరకు మొక్కవోని దీక్షతో రైతులు పోరాడి చట్టాలు రద్దయ్యేలా చేశారని అన్నారు.. ఇప్పుడు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే లాఠీ చార్జీలు చేస్తూ,బాష్పవాయువులు ప్రయోగిస్తూ, నీటితో రబ్బరు బుల్లెట్లుతో దాడులు చేయిస్తున్నారని అన్నారు..దీక్షకు వస్తున్న రైతుల 30 ట్రక్కులు ధ్వంసం చేసారని,రహదారుల లో రానియ్యకుండా ముళ్ళకంచెలు వేస్తున్నారని దాడులతో రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతియ్యలేరని అన్నారు.ఏ దేశానికైనా రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, 14 నెలల కాలంలో చనిపోయిన750 కుటుంబాలకు ఆర్థిక వసతులు కల్పించాలని,ఆ కాలంలో రైతు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని అన్నారు.. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని లేదంటే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి గద్దె దించుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు అచ్యుతుని బాబురావు, సీపీఐ సీనియర్ నాయకులు మేడ వెంకట్రావు, నియోజకవర్గ కార్యదర్శి చిరుమల ప్రకాష్ బాబు,బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, ఓరుగంటి రెడ్డి సంఘం నాయకులు బక్కా జయరామి రెడ్డి,ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకులు మోహన్ కుమార్ ధర్మ,రైతు సంఘం నాయకుడు రావూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు....

No comments