Latest News

చీరాల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఎం.ఎం కొండయ్య ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం

చీరాల (chirala):ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని టిడిపి ఇన్చార్జ్ ఎం ఎం కొండయ్య అన్నారు.శుక్రవారం తెలుగుదేశం పార్టీ చీరాల నియోజకవర్గ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించరు.18 సంవత్సరాలు నిండి కొత్తగా ఓటు పుట్టిన యువతీ యువకులను గుర్తించి వారికి తెలుగు దేశం పార్టీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే పార్టీ మనదని, నిరుద్యోగ భృతి కల్పించిన పార్టీ మనదని వారికి వివరించాల్సిన ఆవశ్యక ఉన్నదని, 80 సంవత్సరాలు నిండిన వయో వృద్ధులను గుర్తించటం వారు ఓటు వినియోగించుకునే విధానము పై అవగాహన కల్పించటం, ఇంటి వద్దనే ఓటు వేసే హక్కును కల్పిస్తున్నది ఎలక్షన్ కమీషన్ దానిని సద్వినియోగం పరుచుకునేటట్లు వారికి అవగాహన కల్పించాలని కోరారు. ఎలక్షన్స్ సమయం వచ్చేసిందని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త  పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఇన్చార్జి మద్దులూరి మాలకొండయ్య కోరారు. ఈ సమావేశంలో పరిశీలకులు నాతాని ఉమామహేశ్వరరావు, నాసిక వీరభద్రయ్య, షేక్ సుభాని, ధోని కనకరాజు, గజవల్లి శ్రీనివాసరావు, డేటా నాగేశ్వరరావు, గంజి పురుషోత్తం, ఉసురుపాటి సురేష్, కొమ్మనబోయిన రజిని, కౌతరపు జనార్ధనరావు క్లస్టర్స్ యూనిట్స్, బూత్ ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments