Latest News

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వాలంటీర్ వ్యవస్థ

వేటపాలెం (vetapalem): ప్రభుత్వ లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నప్పటికీ కింది స్థాయి వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే ప్రయో జనం ఉంటుందని.. ప్రభుత్వ ఫలాలు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఇంటింటికి తీసుకెళ్లేందుకు వాలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమని చీరాల నియోజకవర్గ వైస్సా ర్సీపి ఇన్ఛార్జి కరణం వెంకటేష్ అన్నారు. వేటపాలెం మండల పరిషత్ కార్యాలయంలో వాలంటీర్లకు సేవ రత్న అవార్డుల కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపి ఇంచార్జి కరణం వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఫలాలు ఇంటింటికి చేరవేయడంలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లను సన్మానించడం గొప్ప విషయమన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వాలంటీర్ వ్యవస్థ నిర్మించారన్నారు. వాలంటీర్లు ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వాలంటీర్లకు వందనం కార్యక్రమం ద్వారా, సేవ మిత్ర, సేవరత్న, సేవ వజ్రలు అందిస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిహెచ్ రూతమ్మ,మండల పరిషత్ పర్యవేక్షకులు ఎం.వి.ఎస్. శర్మ ,ఏ. ఓ ఐ కాశీ విశ్వనాథ్, పంచాయతీ కార్యదర్శిలు ఎస్. రాజశేఖర్ రెడ్డి, బి. శ్రీనివాస్ రావు, పి. పూర్ణ కుమారి, కె.శివ లీల, శారదా, వేటపాలెం మండల వై.ఎస్.ర్ సి.పి. పార్టీ అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, సర్పంచ్ కందేటి రమణ, ఉప సర్పంచ్ దంతం వెంకట సుబ్బారావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పులి వెంకటేశ్వర్లు, ఆర్.బి. కె చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు, యువత అధ్యక్షులు ఆవుల అశోక్,అందే కృష్ణ, కట్టా గంగయ్య, జంగిలి రామారావు, కట్టా జార్జ్ సామ్యూల్, కర్ణ లక్షణ రావు,నంగు ప్రభాకర్ రెడ్డి, జిడుగు మస్తాన్, ఆవులు కొండలు, షేక్ కజ్జీ, బుర్ల శివ, పులి హరికృష్ణ, కర్ర వెంకటేశ్వర్లు, కె. విజయ్ సచివాలయ సిబ్బంది, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహసారథులు పాల్గొన్నారు.

No comments