Latest News

తండ్రి స్పూర్తితో ప్రజా సేవలో చుండూరు వాసు

బాపట్ల జిల్లా(chirala): చుండూరు నాగయ్య స్పూర్తితో ప్రజా సేవలో ముందుకు సాగుతానని కొత్త పేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు అన్నారు.బుధవారం టైలర్స్ డే సందర్భంగా కొత్తపేటలోని సీతా రామ నుజమ్మ కళ్యాణమండపంలో చుండూరు నాగయ్య చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవ చేయడం చుండూరు వాసుకే సొంతమని అన్నారు.రాజకీయ పదవుల కోసం ప్రాకులాడే నేటి ఆధునిక సమాజంలో నిస్వార్థమగా సేవ చేయడం వాసుకి చెల్లిందన్నారు.గతంలో సర్పంచిగా ఉన్న సమయం లో వాసు ప్రజల వద్దకే పాలన లాగా ప్రజలు ఆయన వద్దకు రాక మునుపే ఆయన సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడి ప్రజల వద్దకు వెళ్ళేవారని అన్నారు.నిస్వార్థ సేవ చేయడం వాసుకే చెల్లిందని,కొత్తపేట ప్రజలకు ముందు ముందు మరెన్నో సేవకార్యక్రమలు చేపట్టాలని కోరారు.ఈ సందర్భంగా చుండూరు వాసు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సేవ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నానని, తన తండ్రి నుంచి నేర్చుకున్న విలువలను జీవితకాలం పటిస్తానని అన్నారు.రాబోయే రోజులలో విద్యాలేని పేదలకు పశువులను పంపిణీ చేయాలని ఆలోచన తో ఉన్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో నూకతోటి బాబురావు , దామర్ల శ్రీ కృష్ణ, దళిత మహాసభ నాయకులు మాచవరపు జులియన్,ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకులు మోహన్ కుమార్ ధర్మ,కుల వివక్ష పోరాట సమితి నాయకులు లింగం జయ రాజు,పేర్లి రత్నం,పులిపాటి బాబురావు,ప్రకాష్,పేర్లీ నాని,మగ్బల్ భాష,ఎస్ ఏ ఆఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

No comments