Latest News

విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలి


బాపట్ల జిల్లా(chirala): సైన్స్ దినోత్సవం సందర్భంగా చీరాల గౌతమీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శ్రీ గౌతమి ఈ టెక్నో స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.ఈ క్రార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రైట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ పాల్గొని సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్ధిని విద్యార్ధులు తయారు చేసిన పలు ప్రాజెక్టులను ఆయన సందర్శించి విద్యార్థులను ఆయా ప్రాజెక్టు ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చేసిన పలు ప్రాజెక్టులు చుస్తుంటే వారు భవిష్యత్తులో మంచి సైంటిస్టులు అవుతారనే భావన కలుగుతుందన్నారు.చిన్న వయస్సు నుండే విద్యార్ధుల్లో సృజనాత్మక పెంపొందే విధంగా విధ్యాబోధన చేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని డాక్టర్ ప్రశాంత్ అభినందించారు.కార్యక్రమంలో గౌతమి విద్యాసంస్థల అధినేత ముట్టే వెంకటేశ్వర్లు(ఎం.వీ), ప్రిన్సిపల్ రూఫాస్,మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

No comments