Latest News

అభివృధి పధంలో చీరాల రైల్వే స్టేషన్

చీరాల(Chirala):చీరాల రైల్వే స్టేషన్ ఆవరణలో సోమవారం రైల్వేస్టేషన్ సూపరిండెంట్ సింగయ్య అధ్యక్షతన రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి,శంకుస్థాపన ప్రారంభోత్సవం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొన్నారు.అనంతరం ఆమె చేతుల మీదగా శిలా ఫలకంన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 554 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన,ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమం ద్వారా నేడు ఆవిష్కరించడం జరిగింది అని అన్నారు.41వేల కోట్ల నిధులతో ప్రయాణికుల సౌకర్యార్థం బహుళ స్థాయి పార్కింగ్,లిఫ్ట్,ఎస్కలేటర్, ఎగ్జిక్యూటివ్ లాంజ్, లాంజ్ వెయిటింగ్  ఏరియా మరియు వికలాంగులకు అనుకూలమైన సౌకర్య కల్పన. రూఫ్ ప్లాజా,షాపింగ్ జోన్,ఫుడ్ కోర్ట్,చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటి అనేక సౌకర్యాలతో ప్రతి స్టేషన్ సిటీ సెంటర్ గా అభివృద్ధి.1500 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు,అండర్పాస్, లా శంకుస్థాపన,ప్రారంభోత్సవం కార్యక్రమం భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకింతం చేసారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్.ఐ.సి మేనేజర్ హరి ప్రసాద్,చీరాల భారతీయ జనతా పార్టీ నాయకులు అర్వపల్లి కుమార్,బండారు హేమంత్ కుమార్,జనసేన నాయకురాలు కారంపూడి పద్మిని మరియు రైల్వే స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments