Latest News

వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న కరణం వెంకటేష్ బాబు.

చీరాల (chirala): చీరాల మునిసిపాలిటీ పరిధిలో జరిగిన ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు సేవమిత్ర,సేవరత్న ,సేవావజ్ర అవార్డుల పురస్కారాలప్రధాన కార్యక్రమానికి చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ బాబు మాట్లాడుతూ వాలంటీర్లు అందిస్తున్న సేవలను గుర్తించి మన ముఖ్యమంత్రి జగన్ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర, అవార్డుల ప్రధానం చేయడం  జరిగిందన్నారు. పేదల పక్షాన నిలబడి వారి ముఖాల్లో చిరునవ్వులు కలకాలం నిలిచేలా పునరంకితమవుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పారదర్శకంగా ఎంపికైన లబ్ధిదారులకు తోడుగా ఉంటూ సహాయకారిగా వ్యవహరిస్తున్నారన్నారు. తమ పరిధిలోని 50 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచి గ్రామ వార్డు సచివాలయాలకు ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కోడి కూయక ముందే ఇంటి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి మరి టంచెనుగా పింఛన్లు ప్రతినెల ఒకటో తారీఖున అందిస్తున్నారని అన్నారు. పెన్షన్లతో పాటు రేషన్ డెలివరీ, రైస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ల పట్టాలతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికీ గ్రామా వార్డు సచివాలయాల సహకారంతో నిర్దిష్టకాల పరిమితిలో అందేందుకు సహాయపడుతున్నారని అన్నారు. జగనన్న సంక్షేమ క్యాలెండర్ ను అనుసరించి ఎప్పుడు ఏ పథకం అమలవుతుందో ప్రజల దగ్గరకు వెళ్లి వివరించి అవసరం అయితే దగ్గర ఉండి మరీ దరఖాస్తు చేయించే సేవా సైనికులే మన వాలంటీర్లు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్  బోనిగల జైసన్  బాబు, గుంటూరు మాధవరావు, గవిని శ్రీనివాసరావు, మల్లి  వైష్ణవి, మల్లెల లలిత రాజశేఖర్, కీర్తి వెంకటరావు, కట్టా గంగయ్య, చిరంజీవి,డి ఈ ఐసయ్య, సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు, మరియు గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు.

No comments