Latest News

హరిప్రసాద్ నగర్లలో 7 గడ్డి వాములు దగ్దం ....


బాపట్ల జిల్లా (chirala):పట్టణంలోని హరి ప్రసాద్ నగర్ పోలేరమ్మ  గుడి ఎదురు వీధిలో 7 గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో స్థానికుల సమాచారంతో ఫైర్సి  బ్బంది చేరుకొని మంటలను అదుపుచేశారు. స్థానికులు అందించిన వివరాలమేరకు పోలేరమ్మ గుడి వీధిలో మొదటి లైనులో ఖాళీ స్థలంలో ఉన్న గడ్డివాముల నుంచి మంటలు ఎగసిపడటంతో స్థానికులు పరుగులు తీశారు. దీంతో చుట్టుపక్కల వారందరు అక్కడి చేరుకునేలోపై గడ్డివాముల నుంచి పొగ తీవ్రంగా కమ్మేసింది. దీంతో మంటలు, పొగ ప్రభావానికి ప్రజలు ఆందోళన చెందారు. ఎగసిపడుతున్న మంటలను స్థానికులు అదుపుచేయాలని చూసినప్పటికి ఫలితం లేదు. దీంతో పక్కనే వరుసగా ఉన్న ఏడు గడ్డివాములకు ఈ మంటలు వ్యాపించాయి. రెండు ఫైర్ ఇంజన్లు  అక్కడి చేరుకొన్నాయి. క్రేన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. సుమారు రూ.10లక్షలు నష్టం వాటిల్లిందని బాదితులు చెబుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో పక్కనే జవహార్నగర్లో గడ్డివాము తగలపడటం, తర్వాత ఇలా జరగడం చూస్తుంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తగల బెట్టి ఉంటారా లేదా నిజంగానే ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందా అనే తెలియడం లేదని ప్రజలంటున్నారు.

No comments