Latest News

భార్యను హతమార్చిన భర్త, పరారీలో లక్ష్మీనారాయణ....

 

బాపట్ల జిల్లా (chirala ): ప్రేమించి  వివాహం చేసుకున్న భార్యని భర్త హత్య చేసిన సంఘటన బుధవారం స్థానిక రోశయ్య కాలనీలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు రోశయ్యకాలనీకి చెందిన దేవర లక్ష్మీనారాయణ టాటా ఏసీ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. గత కొన్ని సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లాకు చెందిన లక్ష్మీ(35) అనే యువతిని ప్రేమించి వివాహాం చేసుకుని, వరుణ్ తేజ్ (8వ తరగతి), అనే బాలుడి శరణ్య (5వ తరగతి) అనే బాలికను సంతానంగా పొందారు. ఈ క్రమం లో మంగళవారం రాత్రి అందరూ కలిసి భోజనం చేసిన అనంతరం భార్యను తీసుకుని భర్త లక్ష్మీనారాయణ పిల్లలిద్దరినీ నిద్రపొమ్మని చెప్పి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్ళాడు. నిద్రపోయిన పిల్లలద్దరూ ఉదయం లేచి తల్లిదండ్రుల కోసం వెదుకు తుండగా కుమారుడుకి తండ్రి ఎదురురాగా అమ్మ కూడా కనిపించడం లేదని చెప్పాడు. పొలాల్లోకి తీసుకువచ్చానని జీవచ్ఛవంలా పడి ఉన్న తల్లి మృత దేహాన్ని చూపి, తండ్రి లక్ష్మీనారాయణ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కుమార్తె శరణ్యను తీసుకుని లక్ష్మీ మృతదేహాం వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరై రోధించారు. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, లక్ష్మీ మృత దేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించి కేసు నమోదు చేసిన పోలీసులు నింధితుడు కోసం గాలింపు చర్యలు చేపడుతూ లక్ష్మీ మృత దేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఏరియా హాస్పటల్ కు తరలించి, దర్యాప్తు చేపడుతున్నారు.

No comments