Latest News

కొద్ధిపాటి వివాదాలు మినహా ప్రశాంతంగా ముగిసిన కౌన్సిల్ సమావేశం


బాపట్ల జిల్లా(chirala): వందేళ్ల చరిత్ర కలిగిన చీరాల మునిసిపల్ హైస్కూలుకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న భవన సముదాయాలకు స్థల దాతల పేర్లు పెట్టాలని 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు ప్రభాకరరావు అన్నారు.గురువారం చీరాల మునిసిపల్ కౌన్సిలర్ ల సమావేశం కొద్దిపాటి వాదనల తో ప్రశాంతంగా ముగిసింది. వివరాలలోకి వెళితే మొత్తం ముప్పై తొమ్మిది అంశాలతో పొందుపరచ గా ఏడు,పదిహేడోవ  అంశాలపై పదిహేను,పదహరవ కౌన్సిలెర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అనంతరం ఆ రెండు అంశాలు రద్దు చేయబడ్డాయి. సమావేశం కొద్దిసేపు ప్రశాంతంగా జరిగిన ప్పటికీ చీరాల మునిసిపల్ హైస్కూలులోని నూతన భవనాలు,చిల్డ్రన్ పార్కుకి సంబంధించిన వాటికి పేర్లు పెట్టె అంశంపై వాగ్వాదాలు జరిగాయి. చీరాల మునిసిపల్ హైస్కూలు కి స్థల దాతలు వేరు,స్కూల్ భవన్ నిర్మాణ కర్తలు వేరని గత వందేళ్లుగా ఎన్ ఆర్ పి ఎమ్ హైస్కూలు పేరుతోనే పలకరిస్తున్నారు .కానీ స్థల దాతలకు గుర్తింపు లేదని కనీసం ఇప్పుడైనా భోజన శాల,పార్కు లకు స్థల దాతల పేర్లు పెట్టి గుర్తింపు కలుగజేయాలని 15 వ వార్డు కౌన్సిలర్ గుంటూరు ప్రభాకర్ అభ్యర్థన లేవనెత్తగా గత120 ఏళ్లుగా ఆ పేర్లతోనే పిలుస్తున్నారని ఇప్పుడు మార్చడం సరికాదని సాటి కౌన్సిలర్ 16 వ వార్డు అన్నారు.ఇరువురు వాదనలు విన్న చైర్మన్ స్థల దాతల వారసులు మొత్తం కూర్చొని ఒక తీర్మానానికి వచ్చి మునిసిపల్ కౌన్సిల్ కి ఒక అర్జీ దాఖలు పరచాలని దాన్ని బట్టి ఈ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని వివాదాన్ని సద్దుమణిగించారు, దీనికి మనస్తాపం చెందిన కౌన్సిలర్ గుంటూరు ప్రభాకర్ కౌన్సిల్ ని వాకౌట్ చేశారు.ఈ అంశం మినహా మిగిలిన అంశాలన్నీ  తీర్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments