Latest News

మాల జాతి రక్త బంధువులారా మాలల సింహగర్జనకు తరలిరండి....

బాపట్ల జిల్లా (chirala):చీరాల పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో గురువారం మాల మహాసభ పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆదివారం బాపట్ల క్రిస్టియన్ గ్రౌండ్స్ లో జరగబోయే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక మాలల సింహగర్జన వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం మాల మహాసభ పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ అధ్యక్షులు మల్లెల వెంకటరావు మాట్లాడుతూ...భారతదేశంలో ఉన్నటువంటి 1286 షెడ్యూల్ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ఈ నెలలో సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చిందన్నారు. హీరింగ్స్ ముగిసిన అనంతరం కూడా ఈ కోర్టు తీర్పులు జడ్జిలను ప్రభావితం చేయాలని అనేక రాజకీయ పార్టీలన్నీ బిజెపి,టిడిపి,  వైసిపి ఆయా ప్రభుత్వాలు ఆ ప్రభుత్వ నిధులతో లాయర్లను పెట్టి వాదించడం జరిగిందని అన్నారు.ఈ సభ ఆ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాదిగలను కించపరుస్తూ కానీ విద్వేషాలు దూషించి రెచ్చగొట్టే సభ కాదు అని అన్నారు.మాలల  తో పాటు భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ఎస్సీ,ఎస్టీ, ప్రజల రాజ్యాంగ హక్కులు రక్షణలు భద్రతలు కాపాడుకునేందుకు ఏర్పాటుచేసిన సభ అని అన్నారు. మాదిగ ప్రజల్లారా మాదిగ ఉద్యోగుల్లారా మా విజ్ఞప్తి ఏంటంటే ఇకనైనా కళ్ళు తెరవండి ఎమ్మార్పీఎస్,బిజెపి,ఆర్ఎస్ఎస్ ఈ తెలుగుదేశం,వైసిపి ఓటుకు నోట్లు మత్తులో పడకండి అన్నారు.మనకున్న రాజ్యాంగ హక్కులు భవిష్యత్ తరాలకి కాపాడుకోవాలంటే మాత్రం సమైక్యంగా భారతదేశంలో ఉన్న చమర సంఘాలన్నీ ఆంధ్రప్రదేశ్ మాలల వెనుక నడుస్తున్నాయని అన్నారు.ఈ మాదిగ దండోరా వెనక లేవు అని అన్నారు. భారతదేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కులు రక్షణలు,భద్రతలను కాపాడుట కోసం వీళ్ళ హక్కులు కాపాడటం కోసం మేము ఉద్యమిస్తున్నా మని అన్నారు.ఏ రోజు మాదిగ జాతి పట్ల అనవసరంగా మాట్లాడలేదు అన్నారు.మనువాదుల అండతో మాదిగ దండోరా నాయకులు మాలలను రెచ్చగొడుతున్నారు, ఇకనైనా ఈ ప్రయత్నాలు మాని మాదిగ ప్రజలు ఆలోచించాలని అన్నారు.ఎమ్మార్పీఎస్ ని మీ కులం నుండి వెలివేయాలని ,మన హక్కులు మీ హక్కులు కాపాడుకోవాలని కోరుకుంటున్నాము అన్నారు. చీరాలలో ఉన్న మాలలు అందరూ ఈ రాజ్యాంగ హక్కుల రక్షణ పోరాటంలో కలిసి రావాలని అండగా ఉండాలని కారంచేడు ఉద్యమాలకు,చుండూరు ఉద్యమాలకు దళితులకు ఎక్కడ గాయం జరిగినా అండగా నిలబడింది ఈ చీరాలని అన్నారు. రేపు బాపట్లలో జరిగే మాలల సింహగర్జనకు పెద్ద ఎత్తున మాలలు అందరూ తరలివచ్చి ఈ జాతి జనుల హక్కుల కాపాడే ఉద్యమంలో వెన్నుదండగా అండదండలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో దార్ల శాస్త్రి,మల్లెల బుల్లిబాబు, పులిపాటి బాబురావు,జూలియాన్  తదితరులు పాల్గొన్నారు.

No comments