Latest News

దేవినూతల గ్రామం లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎం.ఎం కొండయ్య

బాపట్ల జిల్లా (chirala):చీరాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ,జనసేన,బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఎం ఎం కొండయ్య బుధవారం దేవినూతల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ...ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో గాని చీరాల నియోజకవర్గంలో గాని అభివృద్ధి చేసింది శున్యం అని ఆన్నారు. ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు సిద్ధమయ్యారన్నారు.అలాగే భవిష్యత్ గ్యారెంటీ బాబు షూరిటీ అనే సూపర్ సిక్స్ పథకాల ద్వారా మేము ప్రజల్లోకి వెల్లుతున్నామన్నారు.బడుగు బలహీనవర్గాల ఆలోచనలు అన్నింటిని జగన్మోహన్ రెడ్డి సమాధి కట్టారన్నారు.అలాగే బీసీ డిక్లరేషన్ ను ప్రవేశపెట్టామన్నారు. బీసీలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో ఆయా వర్గాలను ఏ రకంగానూ ఆదుకోవాలో వాటి మీద కూడా మాట్లాడుతామన్నారు.ఒక రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎండగడతానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీకి జరిగినటువంటి అన్యాయం కార్యకర్తల పై జరిగినటువంటి దాడులు ముఖ్యంగా బలహీన వర్గాల వారిపై జరిగినటువంటి దాడులను ఖండిస్తూ ఈ ప్రభుత్వాన్ని ఎండగడతానికి మేమందరం సిద్ధంగా ఉన్నామన్నారు.బటన్ నొక్కడం కార్యక్రమాల ద్వారా మద్యపాన నిషేధం గాని కరెంటు రేట్లు ఎనిమిది సార్లు పెంచటం అయితేనేమి ఆర్టీసీ చార్జీలు పెంచడం ద్వారా గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఆస్తులు అన్నింటిని అమ్ముకున్నాడన్నారు.దాదాపు 13 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల మీద పెను భారం వేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments