Latest News

చీరాలలో హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు......

బాపట్ల జిల్లా (chirala):మెగాస్టార్ చిరంజీవి కుమారుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చీరాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముందుగా ఉదయం ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ఆయన పేరు అర్చన చేయించడం జరిగింది. తదుపరి చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం దేశాయ్ పేట వృద్ధ శరణాలయం నందు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య కుమారుడు రామ్ చరణ్ తండ్రి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ తండ్రి అడుగుజాడల్లో నడవడం చాలా ఆనందదాయకం అని అన్నారు అలాగే రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బాపట్ల జిల్లా రామ్ చరణ్ యువత అధ్యక్షులు గోకుల్ కిరణ్ మాట్లాడుతూ రామ్ చరణ్ ఆశయాలను ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన నిర్వహించే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రకాశం ఉమ్మడి జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్, వీర మహిళ కారంపూడి పద్మిని,కపాల నాగరాజు, ఉప్పల సురేష్, కృష్ణమూర్తి, సురేష్, మరియు రామ్ చరణ్ అభిమానులు ,చిరంజీవి అభిమానులు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments