Latest News

ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి పై చట్టపరమైన చర్యలు: సిఐ శేషగిరిరావు


బాపట్ల జిల్లా (chirala):చీరాల పట్టణంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం పట్టణ సీఐ శేషగిరిరావు  ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై సూచనలు తెలియజేశారు.ఈ సందర్భంగా సిఐ శేషగిరిరావు మాట్లాడుతూ...చీరాల పట్టణంలో ఆటోలకు,డ్రైవర్లకు సంబంధించినటువంటి యూనిఫామ్ మరియు  ఆటోలకు స్టిక్కర్స్,ఐడి కార్డ్స్ అదే విధంగా వాళ్లకు ఆటోస్టాండ్ ను ఏర్పాటు చేయడమైనది అని అన్నారు.ఆటో డ్రైవర్ల అందరూ కూడా ఒక ప్రాపర్ గా  తమ విధుల్లో సక్రమంగా యూనిఫామ్,లైసెన్సు కలిగి ఉండేటట్లు ఏర్పాటు చేశామన్నారు.అలాగే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి సూచనలు తెలియజేస్తూ వివరించడం జరిగిందన్నారు.ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు

No comments