Latest News

సమరసింహారెడ్డి సిల్వర్ జూబ్లీ వేడుకలో ఎం.ఎం కొండయ్య

బాపట్ల జిల్లా(chirala): గోల్డెన్ స్టార్ యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సిల్వర్ జూబ్లీ వేడుకను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఎంఎం కొండయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. స్థానిక ధియేటర్లో శనివారం సమరసింహారెడ్డి బెనిఫిట్ షో నిర్వహించగా అభిమానులు ముఖ్య అతిధిగా ఎంఎం కొండయ్యను ఆహ్వానించారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ 1999 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ను కొట్టిన సమరసింహారెడ్డి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకను నిర్వహిస్తున్నాం అనిఅన్నారు. అనంతరం నందమూరి బాలకృష్ణ అభిమానులు ముఖ్య అతిధిగా హాజరైన ఎంఎం కొండయ్య ఘనంగా సన్మానించి, కేకన్ను కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ టౌన్ వైడ్ ఫ్యాన్సు ప్రేమక్కుమార్, తుమ్మ సభాన్రెడ్డి, షేక్ కాలేషా, షేక్ షరీఫ్, నూతికట్టు పూర్ణ, దామర్ల శ్రీను, షేక్ మొహిద్దీన్, అక్కల ఆంజనేయులు, కౌతారపు జనార్ధనరావు, వంకా హరికృష్ణ, గజవల్లి శ్రీనివాసరావు, పులిపాటి శేఖర్, కొమ్మనబోయిన రజని, కర్పూరపు సుబ్బలక్ష్మి,అలపన రమణమ్మ, పృధ్వి సాంబశివరావు, వెంగళ భరత్, కావూరి శివారెడ్డి తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.

No comments