Latest News

అల్లర్లకు గొడవలుకు పాల్పడితే ఉపేక్షించేది లేదు:డీఎస్పీ బేతపూడి ప్రసాద్

బాపట్ల జిల్లా (vetapalem):వేటపాలెం మండలం రామాపురంలో  మత్స్యకార ప్రజలతో  డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్నికల వేల నేరనియంత్రపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా  గ్రామంలో ప్రస్తుత పరిస్థితులపై డీఎస్పీ నేరుగా గ్రామస్తులుతో మాట్లాడి తెలుసుకున్నారు.అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ రామాపురం గ్రామం అంటే ఒకప్పుడు మంచి పేరు ఉండేదని,అయితే ప్రస్తుతం గ్రామానికి మంచి పేరు పూర్తిగా పోయిందన్నారు.ఇరు వర్గాల్లో తప్పు ఎవరిది అయినప్పటికీ  రామాపురం గ్రామం అనేది బోనులో దోషిగా నిలబడిందన్నారు.సమస్యలను కుల పెద్దలలో పరిష్కరించుకునే సమయంలో కొట్లాటకు వెళ్లి ప్రతి ఒక్కరు జైలు జీవితం గడపడం జరిగిందన్నారు.ఏది ఏమైనా ఇకనైనా గ్రామస్తులందరూ ఒక ఐక్యత భావంతో మెలగాల్సిన అవసరం ఉందన్నారు.ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల పేరుతో ఇరు వర్గాలు మహిళలు కొట్లాటలకు,అల్లర్లకు గొడవలుకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని డీఎస్పీ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ, ఈపురుపాలెం ఎస్సై  శివకుమార్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments