Latest News

చీరాల ఎమ్మెల్యే టికెట్ బీసీలకే కేటాయించాలి.....

బాపట్ల జిల్లా (chirala):చీరాల  పట్టణంలోని గోలి సదాశివ రావు కళ్యాణ మండపంలో ప్రజా సంఘాలు,దళిత సంఘాలు మరియు బీసీ సంఘాల నాయకులు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.అన్ని రాజకీయ పార్టీలు చీరాల టికెట్ ను కచ్చితంగా బీసీలకు ఇవ్వాలని  సమావేశంలో తీర్మానం చేశారు.ఈ సందర్భంగా మాచవరపు జూలియన్ మాట్లాడుతూ... చీరాల నియోజకవర్గంలో మొదటి నుంచి బీసీలకే రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చేవారన్నారు.అయితే క్రమేపి బీసీలను పక్కనపెట్టి ఓసీలకు,దీనికి తోడు బయటి నుంచి వచ్చిన వ్యక్తులకు టికెట్లు  కేటాయించి స్థానికులకు అన్యాయం చేయడం జరిగిందని ఆరోపించారు.చీరాల ప్రాంతంలో వివిధమైన వృత్తులు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న బీసీ కులాలతో పాటు వ్యవసాయ కూలీలుగాను భవన నిర్మాణ కార్మికులు గాను ఇతర అనేక రంగాలలో అసంఘటిత కార్మిక వర్గంగా ఉన్న షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతుల వారు మరియు ముస్లిం మైనారిటీ ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గమైనప్పటికీ అగ్రవర్ణ కులాల వారు గత 20 సంవత్సరాలు కాలం నుండి చీరాలలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ప్రధానమైన కారణం డబ్బు అని అన్నారు.సుమారు రెండు లక్షల ఓట్లతో ఉన్న చీరాల నియోజకవర్గం లో 75% పైగా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ కులాలకు చెందిన వారు ఉన్నారన్నారు.ఈ కులాల వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ మండల ప్రజాపరిషత్,రెవిన్యూ కార్యాలయాలు పోలీస్ స్టేషన్ లో స్థానిక గ్రామ నాయకత్వాలకు అధికారులు జవాబు చెప్పే పరిస్థితి లేదన్నారు.చట్టబద్ధమైన న్యాయమైన అంశాలలో కూడా రాజకీయ ఆధిపత్యం కోసం స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిడి అధికారులపై ఉండటమే ప్రధానమైన కారణం అని అన్నారు.బీసీ నియోజకవర్గమైన చీరాలను  స్వలాభం కోసం ఆయా పార్టీలు  ఓసీలకు టికెట్లు  ఇస్తున్నాయన్నారు.చీరాల ప్రజలను కాదని బయట వారికి ఇచ్చినప్పటికీ వారిని గెలిపించిన చీరాలలో అభివృద్ధి మాత్రం  శూన్యంగా మారిందన్నారు.అన్ని రాజకీయ పార్టీలు స్థానికులకు అందులోనూ బీసీలకు టికెట్ కేటాయిస్తేనే  చీరాల ప్రజల మద్దతు ఉంటుందని లేకుంటే కచ్చితంగా ఆ పార్టీని ఓడిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర,సజ్జా వెంకటేశ్వర్లు,శ్రీకృష్ణ, అవ్వారు ముసలయ్య దేవరపల్లి డేవిడ్,బాబురావు,మోహన్ కుమార్ ధర్మ,చుండూరు వాసు,ఏసురత్నం,జిలాని, తదితరులు పాల్గొన్నారు.

No comments