Latest News

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి....


బాపట్ల జిల్లా (chirala): చీరాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యశాలకు వచ్చే ప్రజలకు భరోసా కల్పిస్తూ వారికి ఆరోగ్య రక్షణ కల్పించాలని తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల పట్టణ పరిధిలోని చర్చి రోడ్డు, మజీద్ సెంటర్ ఎదురు నూతనంగా శుక్రవారం ప్రారంభించిన జి వి ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ గోరంట్ల సుబ్బారావు,డాక్టర్ వి అమృత ఫాణి, డాక్టర్ బాబురావు, డాక్టర్ కృష్ణ చైతన్య, డాక్టర్ శ్రావణి,డాక్టర్ గోరంట్ల రాజేష్, డాక్టర్ నాగేశ్వరావు,డాక్టర్ కొండలరావు మరియు ఇతర ప్రముఖులు హాజరైయారు. ప్రముఖ  సీనియర్ వైద్యులు  డాక్టర్ గోరంట్ల సుబ్బారావు అమృత హస్తాలతో  హాస్పటల్ ను ప్రారంభించి  జ్యోతి ప్రజ్వలన చేసి వైద్యశాలలో ఉన్న వివిధ విభాగాలను ప్రారంభించారు.వైద్యశాల అధినేత డాక్టర్ పల్లె ప్రదీప్ రతన్, వైద్యశాల యం.డి సాధన రతన్ వైద్యశాలలో ఉన్న వివిధ విభాగాలను వారికి వివరించారు.ఈ సందర్బంగా డాక్టర్ గోరంట్ల సుబ్బారావు మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య రక్షణకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని,మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించాలనిసూచించారు.డాక్టర్ అమృత ఫాణి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా హాస్పటల్ యాజమాన్యం కృషి చేయాలని తెలిపారు. పేదల యందు జాలి,దయ కలిగి వీలైనంత వరకు అతితక్కువ ఫీజులు వసూళ్లు చేస్తే మంచిదని హాస్పటల్ యాజమాన్యానికి సూచించారు.డాక్టర్ బాబురావు మాట్లాడుతూ మనకు తల్లిదండ్రులు తరువాత ప్రత్యేక్ష దైవాలు వైద్యులని, వారికి ఒక సమయం అంటూ ఉండదని 24×7 వైద్య వృత్తిలో కొనసాగుతూనే ఉంటారని తెలిపారు. రోగుల యెడల అంతులేని ప్రేమ కలిగి ఉండాలని సూచించారు. వైద్యశాలకు వచ్చే రోగులకు అనవసరమైన వైద్య పరీక్షలు, అనవసరంగా ఔషధాలు అవసరం లేకుండా రోగికి అవసరమైన రీతిలో సరైన వైద్య పరీక్షలు నిర్వహించి రోగిని సంపూర్ణ ఆరోగ్యంగా నవ్వుతూ ఇంటికి పంపాలని తెలిపారు. హాస్పటల్ యండి సాధన రతన్ మాట్లాడుతూ చీరాల పట్టణంలో కార్పోరేట్ వైద్య సేవలు అందించేందుకు పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో  జి వి ఆర్ హాస్పటల్ ను ప్రారంభించటం జరిగిందని తెలిపారు.జి వి ఆర్ హాస్పటల్ యండి డాక్టర్ పల్లె ప్రదీప్ రతన్ మాట్లాడుతూ మీ అందరి సహాయ సహకారాలు,సూచనలు, సలహాలు అమలు చేసే విధంగా ముందుకు సాగుతామని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వైద్యశాల లో అన్ని విభాగాలను ఏర్పాటు చేశామని, ఐసీయూ,సెమీ ఐసీయూ, అత్యాధునిక ఆపరేషన్ థియటర్స్ ,మెడికల్ స్టోర్స్,అత్యాధునిక ల్యాబ్,పూర్తి స్థాయిలో అనుభవం కలిగిన నర్సింగ్ సిబ్బంది,సుమారు 20 పడకలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని హాస్పటల్  ఎండి  డాక్టర్ పల్లె ప్రదీప్ రతన్, సాధన రతన్ లు తెలిపారు.

No comments