Latest News

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి : జడ్జి షేక్ రిహానా

బాపట్ల జిల్లా (chirala): సాధించాలనే తపన ఉండాలి కానీ మహిళలు అన్నిరంగాల్లో దూసుకెళ్లొచ్చని, తనకు పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టాక ఉద్యోగం సాధించానని ప్రిన్సిపాల్ జూనియర్  జడ్జి  షేక్ రిహానా అన్నారు. చీరాల రైట్ హాస్పిటల్ , వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా కల్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  పాల్గొన్న జడ్జి రిహన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా  దినోత్సవం సందర్భంగా రైట్ హాస్పిటల్ మహిళల కోసం  ఉచిత రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించటం గొప్ప విషయమన్నారు. ఉచిత వైద్య సేవలు అందిస్తున్న రైట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని సిబ్బందిని రిహనా అభినందించారు. ఈ క్యాంపులో 130 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్లు ప్రశాంత్, నాగూర్, ప్రత్యూష, శ్రావణ్ కుమార్ సిబ్బంది జాబిల్లి, నబి,రాణి, సాయి, వీరేంద్ర, శివకుమార్, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ పల్లంభట్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి మల్లికార్జున, పోలిశెట్టి శ్యాంసుందర్, జగదీష్, సురేష్ బాబు , శివకుమార్, సత్యన్నారాయణ, జయచంద్ర, నంబూరి పద్మజ తదితరులు పాల్గొన్నారు.

No comments