Latest News

బీసీల సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యం.....

బాపట్ల జిల్లా (chirala ): డిక్లరేషన్ పై హర్షం వ్యక్తం చేస్తూ చీరాల పట్టణ గడియారం స్తంభం సెంటర్ నందు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎం.ఎం కొండయ్య జయహో బి.సి కార్యక్రమంలో పాల్గొన్నారు .ముందుగా  ఫూలే విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ పై హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి  ధన్యవాదములు తెలియచేశారు.అనంతరం  కొండయ్య  మాట్లాడుతూ  తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అని, బీసీల సంక్షేమం కోసం పాటు పడే పార్టీ అని, బీసీ డిక్లరేషన్ లో ముఖ్య అంశాలైన బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తాం పెన్షన్ ను నెలకు నెలకు 4000 పెంచుతాం అని అన్నారు . ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం అన్నారు . సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కుల్ని కాపాడుతాం అన్నారు . బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాంఅని అన్నారు .స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను వైసీపీ ప్రభుత్వం 34% నుండి 24% తగ్గించింది 16, 800 పదవులు దూరం చేశారు అధికారంలోకి వచ్చాక 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తాం అన్నారు . చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం అని అన్నారు . ఆర్థిక అభివృద్ధి ఉపాధికి ప్రోత్సాహాలు  పునరుద్ధరిస్తాం అని తెలిపారు  స్వయం ఉపాధి కి ఐదేళ్లలో పదివేల కోట్లు ఖర్చు చేస్తాం అని అన్నారు .చంద్రన్న బీమా 10 లక్షలతో పునరుద్ధరిస్తాం అని తెలిపారు . పెళ్ళికానుకలు లక్ష రూపాయలకు పెంపుశాశ్విత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం అని అన్నారు . విద్యా పథకాలు అన్ని పునరుద్ధరిస్తాంఅని తెలిపారు .బీసీ భవనాలు కమ్యూనిటీ హాళ్లు నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తాం అని అన్నారు . బీసీల అభ్యున్నతికి, సంక్షేమానికి ఎంతగానో లబ్ది చేకూరుస్తాయని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనల ఉమ్మడి ప్రభుత్వ  గెలుపు కోసం బీసీ సోదరులు ముందుంటారన్నారు.ఈ కార్యక్రమంలో కౌతరపు జనార్ధన్, గజవల్లి శ్రీనివాసరావు, నాసిక వీరభద్రయ్య, హరి ప్రసాద్, రత్నబాబు, మంచాల రామిరెడ్డి, సయ్యద్ బాబు, లావేటి శ్రీనివాస్ తేజ, రమేష్, తేలబ్రోలు నాగేశ్వరరావు, నరాల తిరుపతి రాయుడు, మోహన్ గౌడ్, పులిపాటి శేఖర్, పృద్వి రామారావు,చీమకుర్తి ప్రకాష్ జనసేన పార్టీ నాయకులు ఆర్కే నాయుడు, కారంపూడి పద్మిని, ఎస్ కే భాష, సాయి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

No comments