Latest News

వ్యాయామం ఆరోగ్యానికి ఒక వరం లాంటిది:కరణం బలరాం

బాపట్ల జిల్లా (chirala ):చీరాల మునిసిపాలిటీ పరిధిలో  NR&PM హై స్కూల్ ఆవరణంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మహిళా జిమ్ ను చీరాల శాసన సభ్యులు కరణం బలరామ కృష్ణ మూర్తి,చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కరణం వెంకటేష్  వారి సతీమణి కరణం గీతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు కూడా శారీరక వ్యాయామం కోసం జిమ్ కి రావడం ఆరోగ్యానికి  ఎంతో అవసరం అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చైర్మన్,వైస్ చైర్మన్,పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర డైరెక్టర్లు,జిల్లా నాయకులు    నాయకులు,మునిసిపల్ కౌన్సిలర్స్,వార్డు ఇంచార్జీలు,కో ఆప్షన్ సభ్యులు,మునిసిపల్ D.E ఐసయ్య,A.E కట్టా రవి, మున్సిపాలిటీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు...

No comments