Latest News

చీరాల రైలు ప్రమాదంలో గాయపడిన రిక్షా కార్మికుడిని పరామర్శించిన టిడిపి నేత....

 

చీరాల (chirala): చీరాల పట్టణంలో ఓ రిక్షా కార్మికుడు రిక్షా తీసుకొని రైలు పట్టాలు దాటి వెళ్తుండగా రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనను తెలుసుకున్న టిడిపి పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు తక్షణమే ఆసుపత్రికి వెళ్లి గాయపడిన కార్మికుడిని పరామర్శించారు. 

ఆయనకు ప్రాణహాని లేదని వైద్యులను సంప్రదించి నిర్ధారించుకున్న టిడిపి నేత, బాధితుడికి ధైర్యం చెబుతూ ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాలకొండ దృష్టికి సమస్యను తీసుకెళ్లి, బాధితుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.

ఇక బాధితుడికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులతో మాట్లాడి తక్షణ చికిత్స అందించాలని సూచించారు. ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలు, జనసేన, బీజేపీ అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకొని సంఘీభావం తెలిపారు.

No comments