Latest News

అక్రమ విద్యుత్ వినియోగదారుల పై అధికారులు తనిఖీలు.....

 

చీరాల(chirala):చీరాలలోని D2 సెక్షన్ పరిధిలో డివిజనల్ ఆపరేషన్ మరియు విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 34 బృందాలు ఏర్పడి మొత్తం 151 మంది వినియోగదారులపై దర్యాప్తు చేపట్టి, రూ. 7. లక్షల 10. వేలు అపరాధ రుసుము విధించారు.ఈ ప్రత్యేక తనిఖీల ఉద్దేశ్యం అక్రమ విద్యుత్ వినియోగాన్ని అరికట్టడం, అవినీతిని నిరోధించడం, వినియోగదారుల అవగాహన పెంచడం. అధికారులు ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించి, విద్యుత్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీలకు చీరాల డివిజనల్ కార్యనిర్వాహణ అధికారి బి. హరి ప్రసాద్ రావు నేతృత్వం వహించారు. అదనంగా, వేటపాలెం మరియు పర్చూరు డిప్యూటీ కార్యనిర్వాహణ అధికారులు పి. శ్రీనివాసులు, రమేష్, ఇతర AE, JE లు కూడా పాల్గొన్నారు.



No comments